Monday, April 29, 2024

అర్హులైన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలి.. అదనపు కలెక్టర్ దీపక్ తివారీ

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి : ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన యాదగిరిగుట్ట మండలంలోని బహుపేట గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి కూలీ ఎంత వస్తుందని తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల మేరకు పనిచేసినట్లైతే పూర్తి వేజ్ (కూలి) పొందవచ్చునని, ప్రతి ఉపాధి హామీ వేజ్ సీకర్ కూడా ఆవిధంగా పనిచేస్తే వారికి పూర్తి వేతనం అందుతుందని సూచించారు.

పని ప్రదేశంలో మస్టర్ రోల్ ప్రకారం కూలీల హాజరు, పని వద్ద సౌకర్యాలను పరిశీలించారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని, ఉపాధి హామీ కూలీల శాతం పెరిగేలా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాల్లో గ్రామ పంచాయతీలు కూలీలకు నీడ సౌకర్యం, మంచినీటి వసతి కల్పించాలని సూచించారు. అనంతరం వంగపల్లి గ్రామ పంచాయతీ నర్సరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కె.ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్, వెంకట్ నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ సిద్దిరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement