Wednesday, May 8, 2024

మాస్టర్ దర్శకుడికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. నిత్యం వేళల్లో కేసులు నమోదవుతున్నాయి. కాగా ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీ ఈ మహమ్మారి బారిన పడగా… తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజకు కూడా ఈ మహమ్మారి సోకింది. కరుణ లక్షణాలు కనిపించడం తో లోకేష్ టెస్టులు చేయించుకున్నారు.

దీంతో ఆయన కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లోకేష్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని త్వరలోనే తిరిగి వస్తానని తెలిపారు. ఇక ఇటీవల మాస్టర్ సినిమాతో సందడి చేసిన లోకేష్ ప్రస్తుతం కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement