Saturday, April 27, 2024

లైగర్ కి అదొక్కటే బ్యాలెన్స్ !!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ తర్వాత కేవలం ఈ సినిమాలో ఒక క్లైమాక్స్ మాత్రమే షూట్ చేయాల్సి ఉందట. ఇప్పటికే ఈ సినిమా పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఓ యాక్షన్ సీన్ లో రియల్ ఇంటర్నేషనల్ బాక్సర్ నటించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ ని కూడా పూర్తిగా చేంజ్ చేసుకున్నాడు.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పూరి ఛార్మితో సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement