Saturday, April 27, 2024

బన్నీ వాసు కోసం@అల్లు అర్జున్ !! ఏం చేశాడో తెలుసా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ వాసు ల మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు దశాబ్దాలకు పైగా ఆ ఇద్దరి మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. అయితే నిన్న బన్నీ వాసు పుట్టినరోజు సందర్భంగా చాలా మంది సినీ నటులు దర్శకనిర్మాతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రతి సంవత్సరం కూడా బన్నీ వాసు పుట్టినరోజు ను దగ్గరుండి సెలబ్రేట్ చేస్తూ ఉంటార. ఇప్పుడు కూడా అలానే సెలబ్రేట్ చేశాడు. కానీ ఇక్కడ కాదు ఏకంగా ముంబైకి వెళ్లి తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేశాడు .

బన్నీ వాసు ఓ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ పనులకు సంబంధించి ముంబై వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తన కొడుకుతో పాటు స్వయంగా ముంబై వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడట అల్లుఅర్జున్. ఇక బన్నీ వాసు ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయట. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తో పాటు కొడుకు అయాన్ యు.వి.క్రియేషన్స్ కు చెందిన కేదార్ వంశీ కూడా వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement