Saturday, April 27, 2024

శృతిహాసన్ స్కూల్ యూనిఫార్మ్ లో ఎంత అందంగా ఉందో చూశారా ?

సీనియర్ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా టాప్ గేర్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిజానికి కెరీర్ ఆరంభంలో ఐరన్ లేడీ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ఇక అక్కడ నుంచి కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస హిట్లు కొట్టింది.

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. అది తన చిన్ననాటి ఫోటో. స్కూల్ యూనిఫార్మ్ లో ఉన్న ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు శృతి హాసన్. ఆ ఫోటోలో షర్ట్ వేసుకుని మోకాళ్ళపై వరకు స్కర్ట్ వేసుకొని కూర్చుని కనిపించారు శృతిహాసన్. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement