Friday, April 26, 2024

బాలానగర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరంలోని బాలాన‌గ‌ర్ పారిశ్రామిక వాడ ప‌రిధిలోని రంగారెడ్డి న‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లైవుడ్ ప‌రిశ్ర‌మ‌లో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసేందుకు శ్ర‌మిస్తోంది. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ప్లైవుడ్ ప‌రిశ్ర‌మ‌లో మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Advertisement

తాజా వార్తలు

Advertisement