Sunday, May 5, 2024

తెలంగాణలో కుండపోత.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా గుజరాత్‌లోని కచ్ వరకు ఉపరిత ద్రోణి ఆవరించిందని, మరోవైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. నిన్నటి నుండి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సిరిసిల్ల రాజన్న జిల్లా పెద్దూరులో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement