Saturday, April 27, 2024

అమెజాన్ లో ధనుష్ ‘కర్ణన్’

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా సెల్వరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకులముందుకు వచ్చిన చిత్రం కర్ణన్. ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్లను కూడా బాగానే రాబట్టింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. ఇదిలా ఉండగా చాలావరకు సినిమాలు కరోనా కారణంగా ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణన్ సినిమా కూడా ఓటీటీ లో స్క్రీమ్ కాబోతోంది.

ఈనెల 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమాలో రజిషా విజయన్ హీరోయిన్ గా నటించింది. కులానికి సంబంధించిన అంశం నేపథ్యంలో ఈ సినిమాని సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ సినిమాను కలై పులి థాను వి క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement