Thursday, May 16, 2024

తేజ చేతిలో అభిరామ్ – సురేష్ బాబు మాస్టర్ ప్లాన్ ?

దగ్గుబాటి అభిరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. సినిమాలు తీయక పోయినప్పటికీ సురేష్ బాబు తనయుడిగా, రానా దగ్గుబాటి సోదరుడిగా అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు హీరోగా రెడీ అవుతున్నాడు అభి రామ్. ఆ బాధ్యతను దర్శకుడు తేజ కి అప్పగించడట సురేష్ బాబు. ఇప్పటికే తేజ చెప్పిన ఓ స్క్రిప్ట్ ను సురేష్ బాబు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే అభిరామ్ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారట.

గతంలో తేజ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ నమ్మకంతోనే అభిరామ్ ఎంట్రీని తేజ చేతిలో పెట్టాడట సురేష్ బాబు. కాగా ఈ సినిమాకు ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. తేజ ఆర్ పి పట్నాయక్ కాంబినేషన్ లో గతంలో జయం, నీ స్నేహం, నువ్వు నేను వంటి సూపర్ డూపర్ హిట్ లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement