Wednesday, May 1, 2024

లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోలేదు: కిషన్ రెడ్డి

వరంగల్ అన్ని విధాలుగా అభివృద్ధి కావాలంటే.. బీజేపీ మేయర్ గెలవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వరంగల్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం చేతకానితనం వల్లే.. వరంగల్‌ కు వచ్చిన పీవోహెచ్‌ పరిశ్రమ నిర్మాణం జరగలేదని విమర్శించారు. వరంగల్ రూపురేఖలు మారాలంటే విమానాశ్రయం రావాలన్నారు. వరంగల్‌ కు కేసీఆర్‌ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అధిక నిధులిచ్చిందని తెలిపారు.

కేంద్రం ప్రభుత్వం స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ కింద నిధులు ఇస్తే ఖర్చుపెట్టకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు.  గత ఏడేళ్లలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ కు ల్యాండ్ కావాలి అని అనేక సార్లు లేఖలు రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. వరంగల్ ను హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధి చేసేందుకు బీజేపీ పార్టీ కట్టుబడి వుందన్నారు. కాకతీయ విశ్వ విద్యాలయాన్ని టీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. కార్పొరేషన్ ద్వారా ప్రజల జీవన విధానం మార్చటానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మార్పు కావాలి అనుకుంటే బీజేపీ కి ఓటు వేయాలని కోరారు. కాగా, కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ గురించి నిర్ణయం తీసుకోలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement