Saturday, May 11, 2024

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల లోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలి

వీపనగండ్ల, – రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయంపై రైతులకు భరోసా కల్పించారని తూముకుంట సింగిల్ విండో ఛైర్మన్ రామన్ గౌడ్,మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య,వీపనగండ్ల ఎంపీటీసీ బాస్కర్ రెడ్డి లు అన్నారు,సోమవారం మహిళా సమైక్య,తూముకుంట రైతు సేవసహకార సంఘము ఆధ్వర్యంలో వీపనగండ్ల,సంగినేనిపల్లి,గోపల్ దీన్నే గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలొనే విక్రయించుకోవాలని,దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు, ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి రైతుల బాధలు తెలిసిన వ్యక్తులని రైతుల సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేయని సాహసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందిస్తూ, పంట పెట్టుబడికోసం ఎకరాకు సంవత్సరానికి 10,000 రూపాయలు అందించడం, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రైతు బీమా పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించటం జరుగుతుందని అన్నారు, రైతులు పండించిన పంటలను ఆరబెట్టడానికి కలాల నిర్మాణానికి నిధులను అందిస్తుందని అన్నారు,మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటలు పునరుద్ధరించి వ్యవసాయ పొలాలకు సాగునీరు అందించడమే కాక, ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబావి మండలం లోని చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించడానికి సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాల్ దిన్నె రిజర్వాయర్కు ప్రత్యేక కాలువ నిర్మాణానికి నిధులు కూడా మంజూరు అయ్యాయని పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలిపారు,రైతులు వరి వేరుశనగ వంటి పంటలే కాక చిరుధాన్యాల పంటలను పండించి లాభాలు పొందాలని కోరారు,కార్యక్రమంలో సర్పంచ్ లు నరసింహ రెడ్డి, విజయ్ కుమార్,ఎంపీడీఓ కథలప్ప, బీపీఎం భాషా నాయక్,ఏపిఎం చంద్రకళ,సొసైటీ సీఈఓ రాము,డైరెక్టర్ సూర్యనారాయణ,తెరాస మండల అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్,నాయకులు మల్లయ్య,బాలస్వామి, సాయిబాబు,మహిళ సమైక్య సభ్యులు, రైతులు పాల్గొన్నారు,

Advertisement

తాజా వార్తలు

Advertisement