Monday, May 20, 2024

BJP – తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేడు మోదీ ఫైనల్ టచ్

లోక్ సభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అగ్రనేతలు పబ్లిక్ మీటింగ్స్, రోడ్‌షోలతో దూకుడుగా ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యం లో నేడు ప్రధాని మోదీ తెలంగాణకు మరోసారి రానున్నారు. ఒకేరోజు రెండు సభల్లో పాల్గొననున్నారు. దానిలో భాగంగా.. కర్ణాటక నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నాం 3గంటలకు నారాయణపేటకు చేరుకోనున్నారు. నారాయణపేట జూనియర్‌ కళాశాల మైదానంలో మహబూబ్‌నగర్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. మధ్యాహ్నం 3గంటల 15నిమిషాల నుంచి 4గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇక.. నారాయణపేట సభ తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌కు చేరుకోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.

- Advertisement -

.హైదరాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలను కలిపి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు.

ఈ సభలో 5గంటల 30నిమిషాల నుంచి 6 గంటల 20నిమిషాల వరకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఎల్బీ స్టేడియంలో సభ ముగించుకుని.. 6గంటల 40నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి భువనేశ్వర్‌కు బయల్ధేరి వెళ్లనన్నారు.

ఇక.. ప్రధాని మోదీ చివరి రెండు సభల కోసం బీజేపీ తెలంగాణ నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మోదీ సభ విజయవంతం కోసం భారీ జనసమీకరణకు ప్లాన్‌ చేస్తోంది. ఇక.. ఇప్పటికే.. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేశారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ టార్గెట్‌గా ఘాటైన విమర్శలు చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరడంతో నారాయణపేట, ఎల్బీ స్టేడియం వేదికగా ప్రధాని మోదీ ఎలాంటి కామెంట్స్‌ చేస్తారనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement