Friday, April 26, 2024

భవిష్యత్‌ తరాలకు కూడా మీరు స్ఫూర్తి సార్ : ప్రభాస్

ఈ రోజు చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా బ‌న్నీ త‌న ఇన్‌స్టాగ్రామ్ లో చిరుతో సెట్‌లో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. మీకు, నాకు ఒకే ఒక్క మెగాస్టార్ చిరంజీవి అంటూ బ‌ర్త డే విషెస్ తెలియ‌జేశారు బ‌న్నీ. అల్లు అర్జున్ పోస్ట్ మెగా అభిమానులని ఎంత‌గానో అలరిస్తుంది. చిరంజీవికి విషెస్ తెలియ‌జేసిన ప్రభాస్..హ్యాపీ బర్త్‌ డే టు మెగా మెగా మెగా…మెగా మెగాస్టార్‌ చిరంజీవిగారు. మా తరానికే కాదు. భవిష్యత్‌ తరాలకు కూడా మీరు స్ఫూర్తి సార్ అని వీడియో ద్వారా తెలిపాడు. ఇక విక్ట‌రీ వెంక‌టేష్.. చిరంజీవితో క‌లిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. నాకు గైడ్, నన్ను ప్రోత్సహించే చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక పై మీరు మీ జీవితంలో మునుపటి కంటే ఎక్కువ సక్సెస్‌ను చూడాలి అని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement