Tuesday, May 7, 2024

తాలిబన్ల చెర నుంచి స్వదేశానికి చేరిన భారతీయులు

అఫ్గానిస్థాన్​ లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేసుకున్నారు.  కాబుల్​ నుంచి ఆదివారం ఉదయం బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం భారత్​కు చేరుకుంది. ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని హిండన్​ వైమానిక స్థావరంలో ఈ విమానం ల్యాండ్​ అయింది. 107 మంది భారతీయులు సహా మొత్తం 168 మంది వాయుసేన విమానంలో భారత్​కు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో కాబుల్​ నుంచి వచ్చిన వారికి ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాగా, ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌ లో దారుణ ప‌రిస్థితులు నెల‌కొన్నారు. అఫ్గాన్ తాలిబ‌న్ ఫైట‌ర్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి అరాచక పాలనలో జీవించలేక ప్రజలు దేశాన్ని వీడుతున్నారు. ఇప్పటికే ఐఏఎఫ్‌ రెండు C-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్‌ ఇప్పటికే తరలించింది. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండిః భారతీయులను విడిచిపెట్టిన తాలిబన్లు!

Advertisement

తాజా వార్తలు

Advertisement