Saturday, May 4, 2024

సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న‌.. క‌స్ట‌డీ

హీరో నాగ‌చైత‌న్య‌..హీరోయిన్ కృతిశెట్టి జంట‌గా న‌టిస్తున్న చిత్రం క‌స్ట‌డీ.ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, U/A సర్టిఫికేట్ ను తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలోను అదే రోజున ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అక్కడ స్టార్ హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చిన రికార్డు వెంకట్ ప్రభుకి ఉంది శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమైంది. ఈ సినిమాలో సాధారణమైన పోలీస్ గా చైతూ కనిపించనున్నారు. కథ ప్రకారం విలన్ బ్రతికి ఉండటం హీరోకి అవసరం. అతణ్ణి కాపాడుకోవడం కోసమే హీరో రిస్క్ చేస్తుంటాడు. అందుకు కారణం ఏమిటనేది కథ. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement