Thursday, August 5, 2021

శంకర్ చెర్రీ సినిమాకు కూడా బుర్రా సాయి మాధవ్ నే!!

తన మాటలతో అందరి దృష్టిని ఆకర్షించాడు బుర్ర సాయి మాధవ్. కృష్ణం వందే జగద్గురు,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గోపాలగోపాల, కంచె వంటి అద్భుతమైన చిత్రాలకు మాటలు రాశారు సాయిమాధవ్. అయితే ఇప్పుడు ప్రభాస్ నాగ అశ్విన్ సినిమాకు అలాగే శాకుంతలం,ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కూడా సంభాషణలు రాస్తున్నారు. అయితే ఇప్పుడు శంకర్ రామ్ చరణ్ సినిమాకి కూడా ఆయనే సంభాషణలు రాస్తున్నారు.

ఇటీవల చెన్నై వెళ్లిన సాయిమాధవ్ శంకర్ ను కలిసి ఓ ఫోటోలు దిగారు. ఆ ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ…జెంటిల్ మ్యాన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఫొటో దిగితే జీవితానికి చాలు అని అనుకున్నాను. ఇప్పుడు ఆయన సినిమాకి మాటలు రాస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అలాగే రామ్ చరణ్ కు, శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News