Thursday, April 25, 2024

మాస్కులు లేకుండా విహారయాత్రలు.. ప్రధాని మోదీ సీరియస్..

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది..అయితే చాలా మంది మాస్కులు ధరించకుండా ఇష్టానుసారం బయటతిరుగుతున్నారు.. ముఖ్యంగా విహారయాత్రలకు వెళ్తున్న వారి సంగతి అయితే హద్దులు దాటుతోంది…ఏటు కరోనా కేసులు తగ్గుమఖం పట్టాయని.. మాస్కులు లేకుండా గుంపులుగా తిరుగుతున్నారు. ఇదే అంశం ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యంత్రుల‌తో ప్ర‌ధాని మోదీ ఇవాళ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడుతూ..దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌న్నారు. ప‌రిస్థితి చేయిదాట‌క ముందే మ‌నం మ‌హ‌మ్మారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని చెప్పారు.

అదేవిధంగా క‌రోనా మ‌హ‌మ్మారి అనేక రూపాలు సంత‌రించుకుంటున్న‌ద‌ని, వాటిపై మ‌నం ఓ క‌న్నేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ప్ర‌ధాని అభిప్రాయ‌ప‌డ్డారు. క‌రోనా వేయింట్ల‌పై నిపుణులు అధ్య‌య‌నం చేస్తున్నార‌ని, మ‌నంద‌రం కూడా క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌డంతోపాటు ప్ర‌జ‌లు కూడా పాటించేలా ప్రోత్స‌హిద్దామ‌ని ఆయ‌న ఈశాన్య రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు సూచించారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్ర‌బ‌ల‌కుండా క‌ట్ట‌డి చేయాలంటే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగిరం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఇది కూడా చదవండి:రేవంత్ మాస్టర్ స్కెచ్.. వలసలు షురూ

Advertisement

తాజా వార్తలు

Advertisement