Wednesday, May 15, 2024

Bro Movie – సాయి ధ‌ర్మ్ తేజ్ – కేతికా శ‌ర్మ‌ల‌పై రొమాంటిక్ సాంగ్ షూటింగ్…

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ , సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ కలయికలో వస్తున్న సినిమా ‘బ్రో’. తమిళ్ హిట్ మూవీ వినోద‌య సితం సినిమాకు ఇది రీమేక్ . అక్కడ ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ రీమేక్ ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ‘గోపాల గోపాల’ మూవీ తరువాత మల్లి ఈ సినిమాలో పవన్ దేవుడి తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే విడుద‌లైన‌ ఈ మూవీ టీజర్ కూడా ఆడియన్స్ విశేషంగా ఆక‌ట్టుకుంది.

కాగా ఈ సినిమాని ఈ నెల జులై 28న రిలీజ్ చేయబోతున్న నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీలోని సాంగ్ చిత్రీకరణ కోసం మేకర్స్ ఫారిన్ వెళ్లారు. ఈ సినిమాలో సాయి ధరమ్ కి జోడిగా కేతిక శర్మ ) నటిస్తుంది. వారిద్దరి పై వచ్చే సాంగ్ నే ప్రస్తుతం పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement