Thursday, May 9, 2024

AP: పవన్ చీడ పురుగు.. పాలిటిక్స్ కు పనికిరాడు.. అంబటి రాంబాబు

జనసేన అధినేత పవన్ ఒక చీడ పురుగు అని, పాలిటిక్స్ కు పవన్ పనికిరాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో నిన్న ఏర్పాటు చేసిన జనసేన సభలో పవన్ ఒక వీధి రౌడీలా మాట్లాడారన్నారు. పిచ్చి కుక్కలా స్వైర విహారం చేశారని మండిడ్డారు. నా కొడకల్లారా అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు.

పవన్ కులాలను రెచ్చగొడుతున్నారని అంబటి విమర్శించారు. కాపులందరినీ టీడీపీ అధినేత చంద్రబాబు చంకనెక్కించాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు సీఎం కావాలనేదే పవన్ లక్ష్యమని, పెత్తందార్ల పల్లకిని పవన్ మోస్తున్నారని చెప్పారు. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందని… ఇప్పటి వరకు విజయం లేని, ఎప్పటికీ విజయం రాని పార్టీ జనసేన అని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement