Wednesday, May 8, 2024

సాహో బ్యూటీ కి పెళ్లి అయిపోయింది!!

సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సాహో. అయితే ఈ సినిమాలో జెన్నిఫర్ పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మ ప్రేమించిన ప్రియుడు ని పెళ్లి చేసుకుంది. డాక్టర్ తుషాన్ భిండిని పెళ్లి చేసుకున్న ఎవెలిన్ అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

2019లో ఈ ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి ముందు ఒక ఏడాదికి పైగా ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో
ఉన్నారు. అయితే ఈ పెళ్లి పై మాట్లాడుతూ… బెస్ట్ ఫ్రెండ్ ను వివాహం చేసుకోవడం కంటే మంచి అనుభూతి లేదు. మా జీవితాన్ని కలిసి గడపడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement