Thursday, April 18, 2024

ఆనందయ్య ‘కె’ మందుకు హైకోర్టు అనుమతి

ఆనందయ్య ‘కె’ మందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో కె మందు పంపిణీపై అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయితే, కరోనా బాధితులకు తక్షణమే కె మందును పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది.

మరోవైపు కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నాయంటూ గతంలో ఏపీ ప్రభుత్వం కె మందుకు అనుమతిని ఇవ్వలేదు. ఈ మందును కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌ మందులకు మాత్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు స్పష్టం చేశాయి.

ఇది కూడా చదవండి: చంద్రగిరిలో ఆనందయ్య మందు.. ప్రజలకు ఉచితం పంపిణీ

Advertisement

తాజా వార్తలు

Advertisement