Thursday, May 16, 2024

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్లు వీరేనా..?

బిగ్ బాస్ షో ఐదవ సీజన్ కు రెడీ వుతుంది. జూలైలో బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ లో టాప్ కంటెస్టంట్స్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 5లో జబర్దస్త్ హైపర్ ఆది, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, టిక్ టాక్ స్టార్ దుర్గా రావు హౌజ్ మేట్స్ గా వస్తారని టాక్. జబర్దస్త్ నుండి లాస్ట్ సీజన్ లో అవినాష్ ఎంట్రీ తెలిసిందే. ఈ సీజన్ లో హైపర్ ఆది వస్తాడని టాక్. అలాగే ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్‌ సిరి హన్మంత్‌ కూడా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. మొదట్లో యాంకర్‌గా మెరిసిన సిరి తర్వాత సీరియల్స్‌ వైపు అడుగులేసి నటిగా రాణిస్తోంది. పలు షోలకు హాజరవుతూ ఇప్పుడిప్పుడే పాపులారిటీ పెంచుకుంటున్న ఆమెకు బిగ్‌బాస్‌ నుంచి పిలుపు వచ్చిందట. మరి ఈ ఆఫర్‌ను ఆమె అంగీకరిస్తుందా? తిరస్కరిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: నెలకు రూ.5 లక్షల సంపాదిస్తున్న గిరిజన కూలీ

Advertisement

తాజా వార్తలు

Advertisement