Friday, May 3, 2024

అన్నపూర్ణ స్టూడియోలో గుడి… అందులో బాలయ్య ?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బిబి3. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహా లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో ఓ గుడి సెట్ వేశారట.మూడు నాలుగు రోజుల పాటు ఆ సెట్లోనే షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. 22వ తేదీ వరకు ఆసెట్ లోనే షూట్ చేసి ఆ తర్వాత కర్ణాటక షెడ్యూల్ ప్లాన్ చేసాడట బోయపాటి. మరోవైపు ఈ సినిమాకు సంబందించిన బిజినెస్ కూడా గట్టిగానే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఆంధ్ర ఏరియా థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ.35కోట్లకు అమ్ముడ‌య్యాయ‌ని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement