Sunday, May 19, 2024

వజ్రకాళేశ్వరి దేవి గా అప‌ర్ణా దాస్

మనో హరం, బీస్ట్‌ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అపర్ణా దాస్‌. వైష్ణవ్‌ తేజ్‌ చిత్రంతో తెలుగు సినీరంగ ప్రవేశానికి సిద్ధమ య్యారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఎస్‌. నాగ వంశీ, ఎస్‌. సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల, జోజు జార్జ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శ కుడిగా పరిచయమవుతున్నారు.

అపర్ణా దాస్‌ వజ్రకాళేశ్వరి దేవి పాత్రను పోషిస్తున్నారు. సినిమాకి ఎం తో కీలకమైన పాత్రలో నటిస్తున్న అపర్ణ, తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో పాత్రకు న్యాయం చేస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది.
ఈ చిత్రంలో పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల, జోజు జార్జ్‌, అపర్ణా దాస్‌ తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement