Friday, May 3, 2024

IPL | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 56వ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రి కొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో రెండు జ‌ట్టు 11 మ్యాచ్ లు ఆడ‌గా.. 5 మ్యాచ్ లు గెలిచి 6 ఓడిపోయాయి. అయితే రాజస్థాన్ జ‌ట్టు టేబుల్ లో 5వ స్థానంలో ఉండగా. కోల్‌కతా జట్టు 6వ స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement