Saturday, May 18, 2024

ఇమ్రాన్ కు సుప్రీంలో ఊరట.. విడుదల చేయాలని ఆదేశం

అవినీతి కేసులో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఆయనను తక్షణం విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు సైన్యాన్ని ఆదేశించింది. ఆయన అరెస్ట్ చట్ట విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. కాగా.. అవినీతి కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన మాజీ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను రెండ్రోజుల క్రితం నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) ఆదేశాల మేరకు పారామిలిటరీ రేంజర్లు మంగళవారం ఇస్లామాబాద్ లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇమ్రాన్ ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ నుంచి లాహోర్ కు బయల్దేరారు. రేపు ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరు కావాలని ఇమ్రాన్ ఖాన్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement