Monday, June 17, 2024

Delhi – ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్న మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీ

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నాలుగు దశల పోలింగ్‌ పూర్తి కాగా  మిగిలిన మూడు దశల ఓటింగ్‌కు సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల  25న ఢిల్లీలో ఆరో దశ పోలింగ్‌ జరగనుంది.   ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఢిల్లీలోని ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా, శుక్రవారం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన భార్య గురుశరణ్ కౌర్ న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి తమ ఇంటి నుంచే ఓటు వేశారు.

జిల్లా ఎన్నికల కార్యాలయ అధికారులు ఆయన ఇంటికి వెళ్లి ఓటింగ్ నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇంటికి కూడా ఎన్నికల అధికారులు చేరుకున్నారు. అతనూ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల కార్యాలయం  సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల   కోసం హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సదుపాయం మే 24 వరకు కొనసాగుతుంది.

- Advertisement -

ఢిల్లీలో 5,472 మంది వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. వారు ఇంటి నుంచే ఓటేసేందుకు ఫారం 12డిని నింపారు. దీంతొ వారి ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లి ఓట్ల‌ను సేక‌రిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement