Sunday, May 12, 2024

ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమా పై మరో అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ ,ఆది పురుష్, సలార్, సినిమా చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇక దీంతోపాటు నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

అయితే ఇప్పుడు కరోనా ప్రభావం ఆ సినిమాపై ఎక్కువగా ఉంది. ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియాలోని భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ భాషలో కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. అన్ని అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా జూలై నుండి మొదలు కావాల్సి ఉంది. కానీ పరిస్థితులు ఇప్పుడు సరిగ్గా లేవు. కాగా అక్టోబర్ నెల నుంచి ఈ సినిమా ను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఈలోపు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట నాగ అశ్విన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement