Saturday, March 16, 2024

చంద్ర‌బోస్ కి స‌న్మానం.. ఆస్కార్ అవార్డు ప‌ట్టుకుని ఉప్పొంగిన మెగాస్టార్

ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోలా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. భోలా శంకర్ టీమ్‌తో కలిసి లిరిసిస్ట్ చంద్రబోస్‌ను శాలువాతో సన్మానించారు చిరంజీవి. ఈ సందర్భంగా చంద్రబోస్ నుంచి ఆస్కార్ ట్రోఫీ అందుకున్న చిరంజీవి.. దాన్ని పైకెత్తి సంతోషంతో ఉప్పొంగిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ‘భోలా శంకర్’ టీమ్ మొత్తం ఉండగా.. చిరంజీవి ఆనందాన్ని చూసి నెటిజన్లు పాజిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు.నిజానికి టాలీవుడ్‌లో దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగిన చిరంజీవికి ఈ రేంజ్‌కు వరల్డ్ ఫేమస్ అవార్డ్ దక్కలేదు. కానీ తన కుమారుడు ..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావ‌డం పట్ల తండ్రిగానే కాక ఒక నటుడిగా ఉప్పొంగిపోయారు మెగాస్టార్. ఆస్కార్ ట్రోఫీని పట్టుకున్నపుడు పొందిన సంతోషం ఆయన కళ్లల్లో కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement