Monday, March 18, 2024

అసెంబ్లీలోనే బిజెపి ఎమ్మెల్యే అశ్లీల వీడియోల వీక్ష‌ణం…

అగర్తల: త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ అసెంబ్లీలో బడ్జెట్‌ సెషన్‌ జరుగుతుండగా ఆయన ఫోన్లో అశ్లీల వీడియోలు వీక్షించారు.. ఈ మేర‌కు ఒక వీడియో సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్న‌ది.. దీంతో బిజెపి ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజాప్రతినిధి అయి ఉండి అసెంబ్లీలో ఇలాంటి పనులు చేయడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కాగా జాదవ్ లాల్ నాథ్ బాగ్‌బస్సా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఫోన్లో వీడియోలు చూస్తూ కన్పించారు. ఈ క్రమంలోనే ఓ ఆశ్లీల వీడియోను చూస్తున్న సమయంలో వెనకాల ఉన్న సభ్యులెవరో రికార్డు చేశారు. అది బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయింది. వెంటనే వివరణ ఇవ్వాలని జాదవ్‌కు సమన్లు పంపింది. అయితే ఆయన మాత్రం ఇంకా వీటిపై స్పందించలేదు. విష‌యాన్ని లైట్ గా తీసుకుని అసెంబ్లీ సెషన్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోయారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement