Tuesday, May 14, 2024

రగడ్ లుక్ లో అల్లు అర్జున్ ..ఫోటోలు వైరల్

‌అల్లు అర్జున్.. స్టైల్ కి చిరునామా ఈ పేరు..మనోడు ఏ డ్రెస్ వేసిన అందులో ఓ స్టైల్ ఉంటుంది, ఓ ఎనర్జీ ఉంటుంది. అందుకే సినిమాలోనే కాకుండా బయటకూడా అదిరిపోయే డ్రెస్ లతో స్టైలిస్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘చావు కబురు చల్లగా సినిమా’ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత శరత్‌ చంద్ర నాయుడు బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ త‌న తండ్రి అల్లు అరవింద్‌, సోద‌రుడు అల్లు శిరీష్‌తో క‌లిసి హాజ‌ర‌య్యాడు. ఆ పార్టీలో బన్ని ఫొటోలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ క‌ళ్ల‌జోడు పెట్టి, గెడ్డం పెంచేసి కొత్త లుక్‌లో క‌న‌ప‌డుతుండ‌డం అభిమానుల‌ను ఆక‌ర్షిస్తోంది. చొక్కా పైగుండీలు తీసి ఎన్న‌డూ లేని విధంగా క‌న‌ప‌డుతూ బ‌ర్త్ డే పార్టీలో హంగామా చేశాడు. దీంతో ఈ ఫొటోలను బన్ని ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.

కార్తికేయ, లావ‌ణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా న‌టిస్తోన్న సినిమా ‘చావు కబురు చల్లగా’ సినిమా ఈ నెల‌ 19న విడుదల కానుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో  కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. కాగా, బ‌న్నీ చేతిలో ‘పుష్ప’ సినిమా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement