Tuesday, April 30, 2024

నిమ్మగడ్డకు హైకోర్టు షాక్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓ కేసులో విచారణ చేపట్టిన హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఏపీలో తన పట్టుదలతో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా ముగించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఈ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్‌ల ఉపసంహరణపై సీరియస్ అయ్యారు. ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్పందించిన నిమ్మగడ్డ వాటిపై‌ విచారణకు ఆదేశించారు.

అయితే ఎస్‌ఈసీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నిమ్మగడ్డ ఆదేశాలపై గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు తాజాగా తుది తీర్పు ప్రకటించింది. గత ఏడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో విచారణాధికారం ఎస్‌ఈసీకి లేదన్న పిటిషనర్‌ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఎస్‌ఈసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు గతంలో ఏకగ్రీవమైన చోట్ల డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు ఎస్‌ఈసీని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement