Monday, May 6, 2024

మ‌హేశ్ బాబు పాత్ర‌పై అవన్నీ రూమర్సే.. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్

ద‌ర్శ‌కుడు రాజమౌళికి పౌరాణిక కథలు ఇష్టం. వాటి నుంచి ప్రేరణ పొందుతారు. తన చిత్రాలు భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఉంటాయి. రాబోతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కూడా అలాగే ఉంటుందన్నారు రాజ‌మౌళి తండ్రి..ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్. కాగా సూప‌ర్ స్టార్ మహేశ్‌బాబు పాత్ర హనుమాన్‌ స్ఫూర్తితో ఉండద‌న్నారు. అలాగే ఏ పౌరాణిక పాత్రతో పోలి ఉండద‌ని స్పష్టం చేశారు. అది పుకారు మాత్రమే అని తేల్చారు. రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా నటించబోతున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మహేశ్ కెరీర్ లో ఇది 29వ చిత్రం. ప్రస్తుతం త్రివిక్రమ్ తో మహేశ్ ఓ సినిమా చేస్తునారు. దాని తర్వాత రాజమౌళి సినిమాకు డేట్స్ కేటాయించారు. ఆర్ఆర్ఆర్ అఖండ విజయం తర్వాత రాజమౌళి తదుపరి చిత్రం కావడంతో ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’పై రోజుకో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రం ఫారెస్ట్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఉండబోతుందని, ప్రపంచంలోని అనేక అడవుల్లో సినిమాను చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది.ఈ చిత్రంలో హీరో మహేశ్‌ పాత్రను హనుమంతుడు స్ఫూర్తితో రాశారన్న వార్త కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement