Saturday, May 25, 2024

Trailer | అటు రొమాన్స్ .. ఇటు మాస్ యాక్షన్.. ఆకట్టుకుంటున్న ‘ఆదికేశవ’ ట్రైలర్

టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ హీరోగా.. డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్.రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నాగ వంశీ, సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ నవంబర్ 24న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. దీంతో మూవీ ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. తాజాగా సినిమా ట్రైలర్‌‌ని రిలీజ్ చేశారు.

YouTube video

ఈ ట్రైలర్ సినీ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో ఫన్‌, లవ్‌ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్‌ని కూడా సాలిడ్‌గా చూపించినున్నట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక మూవీలో జోజు జార్జ్ విలన్‌గా కనిపిస్తున్నాడు. రాధిక ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement