Sunday, April 28, 2024

కరాటే కళ్యాణి ఇంట విషాదం..

సీనియర్ నటి కరాటే కళ్యాణి ఇంట్లో విషాదం నెలకొంది ఆమె తండ్రి మృదంగ విద్వాంసులు, హరికథ భాగవతులు పడాల రామదాసు ఆదివారం రాత్రి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పడాల రామదాసు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక బంధువుల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని కరాటే కళ్యాణి ఇల్లు…యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ తిరుమల రెసిడెన్సీ లో ఉంచారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని ఈఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement