Thursday, March 28, 2024

వాణిజ్య శాఖ‌లో సొమ్మిస్తేనే స‌డ‌లింపు…. గ‌గ్గోలుపెడుతున్న వ్యాపారులు..

వ్యాపారులకు వాణిజ్య ‘పన్ను’ పోటు
క్యూఆర్‌ఎంపీ బేఖాతర్‌
వసూళ్లకు తీవ్ర ఒత్తిళ్లు

అమరావతి, : రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ వింతపోకడలు పన్ను చెల్లింపుదారు లను ఆవేదనకు గురి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను సైతం తోసి రాజంటూ ‘మామూళ్ల’ కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నా రు. ఇందుకు క్యూఆర్‌ఎంపీ(క్వార్టర్లీ రిటర్న్స్‌, మంత్లీ పేమెంట్‌) పరిధిలోకి వచ్చే వ్యాపారులకు నోటీసులు జారీ చేయడాన్ని నిదర్శనంగా చెపుతు న్నారు. జీఎస్టీ అమలులో భాగంగా చిన్న వ్యాపారులను దృష్టిలో ఉంచు కొని కేంద్ర ప్రభుత్వం క్యూఆర్‌ఎంపీ విధానం అమలులోకి తెచ్చింది. 2021 జనవరి నుంచి ఈ విధానం అమలులోకి వస్తుం దని కేంద్రం ప్రకటించింది. రూ.ఐదు కోట్ల లోపు వార్షిక టర్నోవర్‌ కలిగిన వ్యాపారులు క్యూఆర్‌ ఎంపీ పరిధిలోకి వస్తారు. వ్యాపార టర్నోవర్‌ను వ్యక్తిగత అంచనా వేసుకొనినెలవారీ పన్నులు చెల్లించడంతో పాటు మూడు నెలలకు ఒకసారి రిటర్న్స్‌ ఫైల్‌ చేస్తే సరిపోతుంది. ఇందుకు విరుద్ధంగా నెలవారీ రిటర్న్‌ ఫైల్‌ చేయడం లేదంటూ వ్యాపారులపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టినా ప్రయోజనం లేని స్థితిలో క్షేత్రస్థాయి అధికారులకు అమ్యామ్యాలు ముట్టచెప్పుకోవాల్సి వస్తోందం టూ వ్యాపారులు చెపుతున్నారు.
ఎందుకీ విధానం..
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత చిన్న వ్యాపా రుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని క్యూఆర్‌ఎంపీ విధానం అమలులోకి తీసుకొచ్చారు. ఈ విధానం అమలుకు కొన్ని పారా మీటర్లు నిర్థేశించుకున్న కేంద్ర ప్రభుత్వం..టిన్‌ నంబర్ల ఆధారంగా క్యూఆర్‌ఎంపీలోకి ఆటోమేటిగ్గా మారే అవకాశం వచ్చింది. ఆటో జనరేటెడ్‌ విధానంలో క్యూఆర్‌ఎంపీ విధానం లోకి వచ్చిన వారు నెలవారీ పన్ను కడుతూ, మూడు నెలలకోసారి రిటర్న్స్‌ ఫైల్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతకు ముందున్న ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌ రూ.5కోట్లు దాటిన వ్యాపారులకు ఈ స్కీము వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో త్రైమాసిక టర్నోవర్‌ రూ.5కోట్లు దాటితే మరుసటి త్రైమాసికానికి సైతం ఈ విధానం వర్తించదని పేర్కొన్నారు. కొత్తగా టిన్‌ నంబర్‌ తీసుకున్న వారితో పాటు ఇన్‌పుట్‌ టాక్స్‌ సబ్సిడీలో లేని వారికి సైతం క్యూఆర్‌ఎంపీ వర్తిస్తుం దని కేంద్రం పేర్కొంది. ఆటో జనరేటెడ్‌ విధానంలో స్కీము వర్తించని వారు క్యూఆర్‌ఎంపీ అవకాశం కోసం గతేడాది డిసెంబర్‌ 5నుంచి ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. నమోదైన వ్యక్తులకు ఐఎఫ్‌ఎఫ్‌(ఇన్వాయిస్‌ ఫర్నిషింగ్ ఫెసిలిటీ) కూడా అవకాశం ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
మాకు తెల్వదు
పలువురు వ్యాపారులు క్యూఆర్‌ఎంపీ విధానంలోకి వచ్చిన ప్పటికీ రిటర్న్స్‌ ఫైల్‌ చేయడం లేదంటూ వాణిజ్య పన్నుల శాఖలోని క్షేత్రస్థాయి అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వ్యాపారులు చెపుతున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేని స్థితిలో విధిలేక మామూళ్లు ఇచ్చుకోవాల్సి వస్తుందని అంటున్నారు. అయితే అధికారుల వాదన మరో విధంగా ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి రిటర్న్‌ పరిశీలించడం వలన వ్యాపారులు తప్పు చేస్తే అడ్డుకునే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు.
పైగా వీరు సకాలంలో రిటర్న్‌ ఫైల్‌ చేయకపోవడం వలన సంబంధిత సంస్థలు ఇన్‌పుట్‌ సబ్సిడీ పొందే అవకాశం కోల్పోతున్నారని పేర్కొంటున్నా రు. వీటికి అడ్డుకట్ట వేసేందుకే రిటర్న్స్‌ ఫైలింగ్‌ కోసం వ్యాపారులకు నోటీసులు ఇస్తున్నామే తప్ప మరోటి కాదని చెపుతున్నారు. క్యూఆర్‌ఎంపీ విధానం దేశ వ్యాప్తంగా అమలులో ఉందని చెపుతూ రాష్ట్రస్థాయిలో తాము వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుందంటున్నారు. నెలాఖ రుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున లక్ష్యాలను చేరుకు నేందుకు ఒత్తిడి తప్పడం లేదంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement