Saturday, April 27, 2024

ఆచార్య రామ్ చరణ్ పాత్రపై మరో రూమర్!!

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆచార్య సినిమా కూడా చేస్తున్నాడు. అయితే మొన్నటికి మొన్న చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య సినిమాకు సంబంధించి చిరంజీవి చరణ్ తుపాకులు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నిన్న మాత్రం కొరటాల శివకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చరణ్ ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. ఆ స్టిల్ చూస్తుంటే రాంచరణ్ రోల్ కి సంబంధించి ఓ ప్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్లు అనిపిస్తుంది.

అందుకు కారణం కూడా లేకపోలేదు. మొదటి విడుదల చేసిన లుక్ లో నక్సలైట్ గా తుపాకీ పట్టుకొని కనిపించాడు. కానీ ఈ ఫోటోలో మాత్రం మెడలో రుద్రాక్షమాల వేసుకొని మీసం మెలేస్తూ డిఫరెంట్ గా కనిపించాడు. ఇక ఈ రెండు ఫోటోలను చూసిన నెటిజన్స్ ఖచ్చితంగా ఈ సినిమాలో చరణ్ పాత్రకు రెండు స్టోరీస్ ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement