Saturday, April 27, 2024

ప్రముఖ దర్శకుడి పై చీటింగ్ కేసు

ప్రముఖ మలయాళ దర్శకుడు శ్రీకుమార్ మీనన్ అరెస్టయ్యారు. చీటింగ్ కేసులో శ్రీకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవల్సం బిజినెస్ గ్రూప్ కు చెందిన రాజేంద్రన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకుమార్ మీనన్ పై కేసు నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళితే 2006 లోజరిగిన డబ్బు లావాదేవీలపై రాజేంద్రన్ శ్రీకుమార్ పై పోలీసులకు ఫిర్యాదు. చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీకుమార్ ఓ చిత్రం కోసం రాజేంద్ర దగ్గర ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నాడట.

అయితే ఆ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్స్ లేవట. అలాగని శ్రీకుమార్ డబ్బును వెనక్కి తిరిగి ఇవ్వలేదట. దీంతో రాజేంద్రన్ పోలీసులను ఆశ్రయించారు. శ్రీ కుమార్ ను గురువారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా అతనిపై 406 అభియోగం నిరూపించబడింది. ఇండియన్ పీనల్ కోడ్ 420 ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోర్ట్ ఆదేశించింది. యాంటిసిపేటరీ బెయిల్ కోసం శ్రీకుమార్ ప్రయత్నించగా కోర్టు దానిని రిజెక్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement