Thursday, September 21, 2023

ఖ‌మ్మం మేయ‌ర్‌గా పునుకొల్లు నీర‌జ‌, డిప్యూటీ మేయ‌ర్‌గా ఫాతిమా

ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ మేయ‌ర్‌గా పునుకొల్లు నీర‌జ‌, డిప్యూటీ మేయ‌ర్‌గా ఫాతిమా జోహ్రో ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, పువ్వాడ అజ‌య్‌తో పాటు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా టీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. పునుకొల్లు నీర‌జ 26వ డివిజ‌న్ నుంచి గెలుపొంద‌గా, ఫాతిమా జోహ్రా 37వ డివిజ‌న్ నుంచి గెలుపొందారు.
ఖ‌మ్మం మున్పిపల్ కార్పొరేష‌న్‌లో మొత్తం 60 స్థానాల‌కు టీఆర్ఎస్ 45 డివిజ‌న్ల‌లో, కాంగ్రెస్ 10, ఇత‌రులు 5 డివిజ‌న్ల‌లో గెలుపొంద‌గా, బీజేపీ ఒక డివిజ‌న్‌లో మాత్ర‌మే గెలిచింది

Advertisement

తాజా వార్తలు

Advertisement