Sunday, May 5, 2024

‘వైవా హర్ష’ గెటప్ప్

కమెడియన్..నటుడు వైవా హర్ష ఒంటి నిండా కట్లుతో ఉన్నారు.  ఇటీవలే హర్ష పెళ్లి కూడా ఫిక్స్ అయ్యింది. ఈ మధ్యనే నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. సమ్మర్ లో పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి.తాజాగా వైవా హర్ష సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ ఫొటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే హర్ష.. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులతో షేర్ చేస్తుంటాడు. లేటెస్ట్ షేర్ చేసిన ఫొటోలో హర్ష హాస్పటల్ బెడ్ పై ఉన్నాడు. అంతేకాదు.. పెద్ద పెద్ద గాయాలకు కట్లుకట్టి ఉన్నాయి. ఈ ఫొటో చూసిన వారంతా హర్షకు ఏమైఉంటుందని కంగారు పడుతున్నారు.ఆ తర్వాత ఆ ఫొటోకు పెట్టిన క్యాప్షన్ చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు. సుమంత్ హీరోగావస్తోన్న ‘అనగనగా ఓ రౌడీ’ చిత్రంలో వైవా హర్ష నటిస్తున్నాడు. ఆ మూవీలోని సన్నివేశం కోసమే హాస్పటల్ బెడ్ ఎక్కాడట హర్ష. ఈ సినిమాలో భాగంగా హర్ష క్యారెక్టర్ కు యాక్సిడెంటల్ అవుతుంది. ఆ సీన్ షూట్ చేస్తున్న సందర్భంగా ఈ ఫొటోను క్యాప్చర్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు హర్ష.

Advertisement

తాజా వార్తలు

Advertisement