Monday, April 29, 2024

బ్రిటన్ యువరాజు ఫిలిప్ కు అస్వస్థత

క్వీన్ ఎలిజబెత్ భర్త బ్రిటన్ యువరాజు ఫిలిప్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను లండన్ లోని కింగ్ ఎడ్వర్డ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన వయస్సు 99 ఏళ్లు.   బ్రిటన్‌లో కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాణి ఎలిజబెత్‌తో కలిసి వెస్ట్ లండన్‌లోని విండ్సర్ రాజభవనంలోనే ఫిలిప్ ఉంటున్నారు. కాగా, గత నెలలో వీరిరువురూ  కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. ఆస్వస్థత కు కారణాలేమిటన్నది తెలియరాలేదు. ఆయన మరి కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొదుతారని మాత్రం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement