Monday, May 20, 2024

మారుతీ చేతుల మీదుగా ‘హాఫ్ స్టోరీస్’ మోషన్ పోస్టర్

హాఫ్ స్టోరీస్ మూవీ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు డైరెక్టర్ మారుతి.రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందుమౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రల్లో.. బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై శివ వరప్రసాద్ కె. దర్శకత్వంలో.. యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హాఫ్ స్టోరీస్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు మారుతి చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ ప్రకటించింది.మోషన్ పోస్టర్ విడుదల అనంతరం డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘‘శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌లో వస్తోన్న ‘హాఫ్ స్టోరీస్’ చిత్ర గ్లింప్స్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అంథాలజీ బేస్డ్ కాన్సెప్ట్ ఇది. అంథాలజీ కాన్సెప్ట్ అంటేనే మంచి హిట్ కాన్సెప్ట్. ఆ జానర్‌లో వచ్చే సినిమాలన్నీ చాలా బాగుంటాయి. ఒకే టోన్‌లో ఐదు రకాల కథలు చెప్పడం సామాన్యమైన విషయం కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement