Thursday, May 23, 2024

ఎమోషనల్ అయిన ‘అల్లరి నరేష్’

యంగ్ హీరో అల్లరి నరేష్  2012లో నటించిన  సుడిగాడు చిత్రం త‌ర్వాత న‌రేష్‌కు మంచి హిట్ ద‌క్క‌లేదు. దీంతో ఈ సారి నాంది అనే థ్రిల్ల‌ర్ క‌థ‌ను ఎంచుకున్నాడు.ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌లైన నాంది చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ముఖ్యంగా అల్ల‌రి న‌రేష్ న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది.   చాలా కాలం తర్వాత సక్సెస్‌ని చ‌వి చూడడంతో నరేశ్‌ సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌గా, ఆ స‌మావేశంలో న‌రేష్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. క‌న్నీళ్ళు పెట్టుకున్నాడు.  ఇన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్ళీ నా ఫోన్ నాన్ స్టాప్‌గా మోగింది. ఈ విజ‌యం  నాకు చాలా బూస్ట‌ప్ ఇచ్చింద‌ని అల్ల‌రి న‌రేష్ తెలిపాడు. హరీష్‌శంకర్‌ శిష్యుడు విజయ్‌ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement