Friday, June 14, 2024

Dinesh Karthik : ఐపీఎల్‌కు డీకే గుడ్‌బై…

టీమిండియా వెటరన్ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు గుడ్ బై చెప్పాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓడిన అనంతరం డీకే తన ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు.

- Advertisement -

మైదానం నుంచి డగౌట్‌కు వెళుతుండగా.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ 2024లో కార్తీక్‌ 15 మ్యాచ్‌లు ఆడి 326 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో 2008 ఎడిషన్‌ నుంచి దినేశ్‌ కార్తిక్‌ ఆడుతున్నాడు. 17 సీజన్లలో ఇప్పటివరకు 257 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. డీకే అత్యధిక స్కోర్ 97 నాటౌట్. కీపర్‌గా 145 క్యాచ్‌లు, 37 స్టంప్‌ ఔట్లు, 15 రనౌట్స్ చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు జట్లకు కార్తిక్‌ ప్రాతినిధ్యం వహించాడు. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ లయన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లకు ఆడాడు. చివరగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.

మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌కు దినేశ్‌ కార్తిక్‌ గుడ్‌బై చెప్పాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. డీకే 2004లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే ఎంఎస్ ధోనీ వెలుగులోకి రావడంతో అతడు కనుమరుగయిపోయాడు. భారత్ తరఫున 26 టెస్టులు ఆడి 1025 పరుగులు చేశాడు. చివరిసారిగా 2018లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. 94 వన్డే మ్యాచ్‌లు ఆడిన కార్తిక్‌.. 1752 పరుగులు, 64 క్యాచ్‌లు అందుకున్నాడు. 60 టీ20లలో 686 రన్స్, 30 క్యాచ్‌లు పట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement