Tuesday, July 23, 2024

TS : బీఆర్ఎస్ కీల‌క నేత దారుణ హ‌త్య

బీఆర్ఎస్ కీల‌క నేత దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు శ్రీధర్ రెడ్డి (53) దారుణ హత్యకు గురయ్యాడు.తమ గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలం మిరపకాయల కళ్ళం వద్ద నిద్రించిన శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో గొడ్డళ్లతో నరికి చంపారు.

- Advertisement -

గురువారం ఉదయం చుట్టుపక్కల వారు విషయం తెలుసుకున్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా పోలీసులు గుర్తించారు. అయితే శ్రీధర్ రెడ్డి హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement