Friday, June 14, 2024

AP : విద్యార్థినీ పై తోటి విద్యార్థి ఆత్యచారం…ఆపై బ్లాక్​మెయిల్​

ఏపీ హేయ‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. విద్యార్థినీ పై తోటి విద్యార్థి ఆత్మ‌చారానికి పాల్ప‌డ్డాడు. ఈఘ‌ట‌న‌ను గ్రామానికి చెందిన న‌లుగురు యువ‌కులు త‌మ పోన్‌ల‌లో చిత్రీక‌రించారు. అనంత‌రం స‌ద‌రు బాలిక‌ల‌ను త‌మ కోరిక‌లు తీర్చాలంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. ఈ వీడీయోను త‌ల్లిదండ్రుల‌కు చూపించి డ‌బ్బులు కావాల‌ని బ్లాక్​మెయిల్​కు దిగారు. ఈ హేయ‌మైన ఘ‌ట‌న ఏలూరు జిల్లా కైక‌లూరు మండ‌వ‌ల్లి హైస్కూల్‌లో చోటుచేసుకుంది. వారి బెదిరింపులు తాళ‌లేక బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

- Advertisement -

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మండవల్లి మండలంలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఓ గ్రామానికి చెందిన బాలిక ఉత్తీర్ణత సాధించింది. ఈ క్రమంలోనే ఈ నెల 15న మార్కుల మెమోను తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లింది.
టీచర్లు అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్తుండగా.. మాటువేసిన తోటి విద్యార్థి బాలికను తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ సంఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీశారు. బాలికకు వీడియో చూపించి తమ కోరికను తీర్చాలని బలవంతం చేశారు.

అనంతరం తమకు డబ్బులు ఇవ్వాలంటూ బాధితురాలి తల్లిదండ్రులను బెదిరించారు. రూ.2లక్షలు ఇస్తామని బాధితురాలి తల్లిదండ్రులు ప్రాధేయపడినా.. ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్‌ చేశారు. దాంతో పాటు వీడియోను వాట్సప్‌ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారానికి ఒడిగట్టిన బాలుడిని అదుపులోకి తీసుకొని విజయవాడ జువైనల్‌ హోమ్‌కు తరలించారు. వీడియోను గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసిన నలుగురిని అరెస్ట్ చేసి కైకలూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement