Monday, June 10, 2024

Iran : నేడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు

హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని స్మరించుకుంటూ ఇరాన్ ప్రభుత్వం సంతాప కార్యక్రమాలు ప్రకటించింది. అయితే హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశానికి సమీపంలోని తబ్రిజ్ పట్టణంలో శవపేటికలతో సంతాప యాత్ర జరిగింది.
ఈ కార్యక్రమంలో నల్లదుస్తులతో, ఇరాన్ జెండాలు పట్టుకుని ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. కాగా ఇవాళ రైసీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

- Advertisement -

ఆయన పుట్టి పెరిగిన మషాద్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి భారత్ తరపున అధికారికంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నివాళులర్పించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన అధ్యక్షుడు, ఆ దేశ విదేశాంగ మంత్రికి భారత్ తరపున నివాళులర్పిస్తారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement