Saturday, April 27, 2024

న్యూ లుక్ లో ‘రామ్’

ఎనర్జిటిక్ హీరో రామ్ న్యూలుక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రామ్ కొత్త చిత్రం కోసమేనా ఈ లుక్ అంటున్నారు నెటిజన్స్. కాగా రామ్ దర్శకుడు సుకుమార్ కుమారై శారీ ఫంక్షన్ లో ఇలా మెరిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇందులో రామ్ లాంగ్ హెయిర్ – గడ్డంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ నెక్స్ట్ సినిమాలో రామ్ లుక్ ఇదేనని ఫిక్స్ అయ్యారు. రామ్ పోతినేని – తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి జరుపుకోనుంది. ఇది రామ్ నటిస్తున్న 19వ సినిమా. ద్విభాషా చిత్రంగా తెలుగు తమిళ భాషల్లో రూపొందనుంది. ఈ మూవీ స్టార్ట్ అవడానికి మరో రెండు నెలల సమయం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement