Sunday, May 5, 2024

నా కల నెరవేరింది..’సోహెల్’

బిగ్ బాస్4 దయవల్ల కొత్తకారు కొన్నానని తెలిపాడు సోహెల్.  తండ్రితో క‌లిసి కొత్త కారుతో దిగిన ఫొటోలు షేర్ చేసిన సోహెల్.. మా నాన్న నాకు  ఆద‌ర్శం ,ఆయ‌న బ్లెస్సింగ్స్ వ‌ల‌న  కొత్త కారు కొన‌డం  సాధ్య‌మైందన్నారు.బిగ్ బాస్ షోలో పాల్గొన‌క‌ముందు సోహెల్ ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టించాడు. కాని ఎప్పుడు అత‌నికి పెద్ద‌గా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఎప్పుడైతే అడుగుపెట్టాడో అప్ప‌టి నుండి ఆయ‌న క‌థ వేరుగా మారింది. మెగాస్టార్  చిరంజీవి వంటి స్టార్ సెల‌బ్రిటీ ఆయ‌న ఇంటి నుండి ప్ర‌త్యేకంగా బిర్యానీ పంప‌డంతో పాటు సోహెల్‌కు ఆతిథ్యం కూడా ఇచ్చారు. అలానే అనేక సినిమా ఆఫ‌ర్స్ సోహెల్ వెనుక క్యూ క‌డుతున్నాయి. రానున్న రోజుల‌లో సోహెల్ క‌థ మాములుగా ఉండేలా లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement