Thursday, April 25, 2024

కామెడీగా ‘షాదీ ముబారక్’ టీజర్

షాదీ ముబారక్ టీజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హీరోగా సాగర్ నటిస్తున్నాడు.  ఇందులో సాగర్ కి జోడీగా దృశ్యా రఘునాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి పద్మశ్రీ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ సినిమాని మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘షాదీ ముబారక్’ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది . టీజర్ చూస్తుంటే అబ్బాయి నచ్చితే సరిపోదు అతని ‘ఇంటిపేరు’ కూడా నచ్చాలి అనుకునే అమ్మాయికి.. ‘సున్నిపెంట’ అనే ఇంటిపేరు ఉన్న వ్యక్తితో పెళ్లి నిశ్చమైన తర్వాత ఏర్పడిన పరిస్థితులే ఈ సినిమా అని తెలుస్తోంది. ఇందులో ‘సున్నిపెంట మాధవ్’ గా సాగర్ కనిపిస్తుంటే.. దృశ్యా ‘తుపాకుల’ ఇంటిపేరు కలిగిన అమ్మాయిగా కనిపిస్తోంది. ‘షాదీ ముబారక్’ టైటిల్ చూసి ఇది పెళ్లికి సంబంధించిన ఎమోషన్ జర్నీ అనుకుంటే.. టీజర్ ద్వారా ఇది ఇంటిపేరు చుట్టూ జరిగే కామెడీ ఎంటర్టైనర్ అని తెలియజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement